తెలుగులో టు స్టేట్స్ | To States in telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో టు స్టేట్స్

Published Sat, Sep 24 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

తెలుగులో టు స్టేట్స్

తెలుగులో టు స్టేట్స్

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అల్రెడీ తెలుగు రాష్ట్రాలు రెండున్నాయి. తెలుగులో ‘టు స్టేట్స్’ అంటే ఏపీ, టీజీ నేపథ్యంలో ఓ సినిమా అనుకోవద్దు. ‘టు స్టేట్స్’ అనేది హిందీ సినిమా పేరు. ఇప్పుడీ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకట్ కుంచెమ్ ఈ  రీమేక్ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ నవలలు అంటే బాలీవుడ్‌లో హాట్ కేకులు.
 
 ఈయన రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ‘త్రీ ఇడియట్స్’గా, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ను ‘కై పో చే’గా, ‘టు స్టేట్స్’ను అదే పేరుతో సినిమాలుగా తీసి బాలీవుడ్ దర్శక-నిర్మాతలు భారీ విజయాలు అందుకున్నారు. ‘టు స్టేట్స్’ నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్ ఇప్పటివరకూ తమ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఏ సినిమా హక్కులనూ దక్షిణాదికి ఇవ్వలేదు. వీవీ వినాయక్ సహకారంతో అభిషేక్ పిక్చర్స్, వెంకట్ కుంచెమ్ ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. త్వరలో నటీనటులు, ఇతర వివరాలు తెలియజేస్తామని నిర్మాత అభిషేక్ నామా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement