ముంబై: అశ్లీల వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాన్ని సెలబ్రిటీలు తప్పుబట్టారు. ఈ చర్య సమర్థనీయం కాదని కుండబద్దలు కొట్టారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Maybe soon, we can expect #Twitter ban, #Facebook ban, #YouTube ban.. Will be back to reading books.. Oh no! They may be banned too
— Minissha Lamba (@Minissha_Lamba) August 3, 2015
ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ చూడడంపై కూడా త్వరలో నిషేధం విధిస్తారేమోనని బాలీవుడ్ నటి మినీషా లంబా అనుమానం వ్యక్తం చేసింది. వీటిని నిషేధిస్తే పుస్తకాలు చదువుకోవచ్చు అనుకుంటున్నారా. పుస్తకాలు చదవడంపై కూడా నిషేధం విధిస్తారేమోనని ట్వీట్ చేసింది.
Don't ban porn. Ban men ogling, leering, brushing past, groping, molesting, abusing, humiliating and raping women. Ban non-consent. Not sex.
— Chetan Bhagat (@chetan_bhagat) August 3, 2015
పోర్న్ సైట్లపై నిషేధం వద్దని ప్రముఖ రచయిత చేతన్ భగత్ కోరారు. వక్రదృష్టి, వంకరచూపులు, కంత్రీతనం, కామాతురత, వేధింపులు, లైంగిక హింస, అణచివేత, అత్యాచారాలను బాన్ చేయాలని డిమాండ్ చేశారు. నీలి చిత్రాల సైట్లపై నిషేధంతో లైంగిక హింస నేరాలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది తెలియడం లేదని నటుడు ఉదయ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ అన్నారు. నిషేధం విధించిన పార్టీకి చెందిన వారే పార్లమెంట్ లో పోర్న్ సైట్లు చూస్తూ దొరికిపోయారని తెలిపారు. మూర్ఖులపై నిషేధం విధించాలని సోనమ్ కపూర్ కోరింది.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్లు సంధించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఆపేసినట్టుగా కేంద్ర ప్రభుత్వ చర్య ఉందని వర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే పోర్న్ సైట్లను మాత్రమే నిషేధించారు. త్వరలో ప్రభుత్వం పడకగదిలోకి ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.
Now they have just banned porn but very soon the Government might come into the bedroom to see how couples are having sex
— Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2015