Minissha Lamba
-
రాత్రి డిన్నర్‌కు వస్తావా? అని అడిగారు: నటికి చేదు అనుభవం
సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి నటి మినీషా లంబా పెదవి విప్పింది. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా వేళ్లూనుకుపోయిందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "ప్రతి ఇండస్ట్రీలోనూ మగాళ్లు ఉంటారు. సినీ పరిశ్రమలో కూడా అంతే! తమ కనుసన్నల్లో పనిచేసేవారి కోసం కొందరు మగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమా ఆఫర్ గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు కొందరు నన్ను డిన్నర్‌కు రమ్మని పిలిచేవారు" "రాత్రిపూట డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేవారు. కానీ నేనందుకు అసలు ఒప్పుకోలేదు. డిన్నర్ కుదరదని, మనం ఆఫీసులోనే మాట్లాడుకుంటే సరిపోతుంది అని ముఖం మీదే చెప్పేసేదాన్ని. అంటే వాళ్లుం ఏం ఆశిస్తున్నారో తెలిసినా నాకేమీ అర్థం కానట్లు నటించేదాన్ని. ఇలా రెండుమూడుసార్లు జరిగాయి. కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు" అని చెప్పుకొచ్చింది. 'యహాన్' చిత్రంతో 2005లో వెండితెర అరంగ్రేటం చేసింది మినీషా లంబా. 'బచ్నా యే హసీనా', 'కిడ్నాప్', 'అనామికా', 'జోకర్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె హిందీ బిగ్‌బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. అదే విధంగా 'తెనాలి రామ', 'ఇంటర్నెట్ వాలా' వంటి టీవీ షోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. నటి పూజా బేడీ కజిన్ రియాన్‌ను 2015లో పెళ్లాడిన ఆమె 2020లో వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. అయితే విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, తాను మళ్లీ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఇటీవలే వెల్లడించింది మినీషా. చదవండి: భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి -
భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి
ముంబై: తాను మళ్లీ ప్రేమలో పడ్డానని, ప్రస్తుత బంధంలో ఎంతో సంతోషంగా ఉన్నానంటోంది బాలీవుడ్ నటి మినీషా లంబా. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, సరైన వ్యక్తి తారసపడితే సరికొత్త ఆనందాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగితేనే మనశ్శాంతిగా బతకవచ్చని, తాను ప్రస్తుతం అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బచ్నా యే హసీనా, కిడ్నాప్, అనామికా, జోకర్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మినీషా లంబా.. బిగ్‌బాస్ 8 సీజన్లో పాల్గొంది. అదే విధంగా తెనాలి రామ, ఇంటర్నెట్ వాలా వంటి టీవీషోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే... 2015లో రియాన్ థామ్ అనే నైట్‌క్లబ్ యజమానిని పెళ్లాడిన మినీషా... అతడితో విభేదాలు తలెత్తిన కారణంగా 2020లో విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన మినీషా.. ‘‘ప్రతి ఒక్కరికి సంతోషంగా జీవించే హక్కు ఉంటుంది. కానీ మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూడటం చాలా మందికి అలవాటు. అయితే, ఆధునిక మహిళలు.. ముఖ్యంగా స్వతంత్రంగా జీవించగల శక్తి గలవారు ఇందుకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నారు. గతంలో అయితే, వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కేవలం స్త్రీలు మాత్రమే ప్రయత్నించేవారు.. కష్టనష్టాలు భరిస్తూ.. ఎన్నో త్యాగాలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిలబడవు అనుకున్న బంధనాల నుంచి విముక్తి పొందేందుకు వెనుకాడటం లేదు. నిజానికి విభేదాలు తారస్థాయికి చేరిన తర్వాత ఆ వివాహ బంధంలో కొనసాగటం కూడా సరికాదు. విడాకులు తీసుకోవడమే మంచిది. అయితే భర్తతో విడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. నేను ప్రస్తుతం.. మంచి వ్యక్తిత్వం గల ఓ మనిషితో ప్రేమలో ఉన్నాను. నాకు మరోసారి నా ప్రేమ లభించింది’’ అని సమాజకట్టుబాట్లు, తన ఆలోచనా విధానం గురించి వివరించింది. చదవండి: సౌత్ నిర్మాత తన గదిలోకి రమ్మన్నాడు: సీనియర్ నటి -
విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి
దంపతులు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు విడిపోవడం మంచిదని.. అదేం నేరం కాదంటున్నారు నటి మినిషా లాంబా. ఏడాది క్రితం తాను తన భర్త ర్యాన్ థామ్‌తో విడిపోయిన్నట్లు ప్రకటించిన మినిషా లాంబా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘జీవితం కొనసాగుతూనే ఉంటుంది. సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ఇద్దరి మధ్య బంధం.. అది ప్రేమా, స్నేహమా, వివాహ బంధమా ఏదైనా సరే.. బలంగా లేదనుకొండి.. విడిపోవడం ఉత్తమం. అదేం పెద్ద నేరం కాదు. సంతోషంగా బతకడానికి మనకున్న మార్గం అది’’ అన్నారు. అలానే ‘‘ప్రతి ఒక్కరు ప్రేమను పొందాలని.. దాన్ని ఆస్వాధించాలని ఆశిస్తారు. ఆడవాళ్లు ప్రేమ విషయంలో ఒపెన్‌గా ఉండకూడదా.. గతంలో ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురయ్యి ఉండవచ్చు.. దాంతో ఆమె ప్రేమకు దూరంగా ఉంటానని చెప్తుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎదురుపడినప్పుడు ఆమె ఆ గోడలను బద్దలు కొట్టి.. ప్రేమను ఆహ్వానిస్తుంది’’ అన్నారు మినిషా. (చదవండి: విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్) మినిషా లాంబా దాదాపు 2 సంవత్సరాల డేటింగ్ చేసిన తర్వాత 2015 సంవత్సరంలో పారిశ్రామికవేత్త ర్యాన్ థామ్‌ను వివాహం చేసుకున్నారు. గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయం వెల్లడించారు. "ర్యాన్, నేను స్నేహపూర్వకంగా విడిపోయాము. చట్టపరమైన విభజన జరిగింది" అని తెలిపారు. తామిద్దరు 2018 అక్టోబర్ నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. మినిషా లాంబా, ర్యాన్ థామ్ 2015 జూలై 6 న కోర్టు వివాహం చేసుకున్నారు. తరువాత రిసెప్షన్ నిర్వహించగా.. సన్నిహితులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. -
అలాంటివంటే నాకు తెగ సిగ్గు: నటి
2005లో 'యహాన్' సినిమాతో చిత్రసీమలో తెరంగ్రేటం చేసింది మినీషా లంబా. పలు సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా సందడి చేసిన ఆమె నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఎంచక్కా నచ్చిన ప్రదేశంలో బర్త్‌డే జరుపుకోవచ్చు అనుకుంది కానీ కరోనా వల్ల ఆమె తన ప్లాన్లను రద్దు చేసుకుని ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను, బాలీవుడ్లో తన ప్రయాణాన్ని ఓసారి నెమరు వేసుకుంది. 'ముందుగా నేను ఎదగడానికి దోహదపడ్డ నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తున్నా. ప్రతి బర్త్‌డే పార్టీకి నాకు బోలెడన్ని బహుమతులు వచ్చేవి. అప్పుడు అమ్మ ఎవరెవరు ఏమేం ఇచ్చారో వివరంగా రాసిపెట్టేది. ఎందుకంటే దాన్నిబట్టే కదా! మనం కూడా వాళ్ల పుట్టినరోజుకు గిఫ్ట్‌లు ఇవ్వాలి. నా చిన్నప్పుడు అయితే పుస్తకాలు, బట్టలు గిఫ్ట్ ఇస్తే అసలు నచ్చేదే కాదు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక అవే బహుమతులు ఇతరులకు పంచుతుంటే సంతోషంగా ఉంటుంది. కాలం అన్నింటినీ మార్చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన బహుమతుల్లో నాకు అత్యంత విలువైనది ఈ బుక్ రీడర్. ఎందుకంటే దాన్ని నేను ఎంచక్కా ఎక్కడకు వెళ్లినా నా వెంట తీసుకువెళ్లొచ్చు. ఇక బాల్యంలో బర్త్‌డేలు అంటే తెగ సంబరపడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం సిగ్గేస్తుంది. పార్టీలో 50 మంది కన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు సౌకర్యవంతంగానే అనిపించదు' అని పేర్కొంది. (చదవండి: ధనుష్‌తో మరోసారి జోడి కడుతున్న తమన్నా) సినిమాల్లో అవకాశాలు... 'ఎందుకో తెలీట్లేదు కానీ కొన్నేళ్లుగా నాకు మంచి ఆఫర్లు రాడం లేదు. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్ వచ్చాక బోలెడంత స్పేస్ దొరికింది. కంటెంట్ బాగుంటే అందరూ ఆదరిస్తారు. నేను త్వరలో కుతుబ్ మినార్ చిత్రం ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనున్నాను. వేసవిలోగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజవుతుంది' అని మినీషా చెప్పుకొచ్చింది. కాగా హిందీ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొన్న మినీషా నటి పూజా బేడీ సోదరుడు రియాన్‌ను 2015లో వివాహం చేసుకుంది. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ 2020లో వీళ్లిద్దరూ విడిపోయారు. (చదవండి: ఎక్కడికో ఈ అడుగు) -
నెట్టే కదా అని తిట్టేయడమేనా!
‘వెల్ డన్ అబ్బా’.. ఒక హిందీ సినిమా!‘ రాజుగారి చేపల చెరువు’ అనే సినిమాకు స్ఫూర్తి వెల్ డన్ అబ్బానే. ఆ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి మినిషా లాంబా. నటనంటే చచ్చేంత ఇష్టం ఆమెకు. అందుకే గ్లామర్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న పార్లల్ మూవీస్‌లోనూ చేస్తున్నారు. యాక్టింగ్ అంటే అంత అభిమానం కాబట్టే టీవీ స్క్రీన్ మీద కనిపించడానికీ మొహమాటపడ్డంలేదు. ‘‘ఇంటర్నెట్‌వాలా లవ్’’ అనే షోతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులనూ అలరించనున్నారు. అందులో ఆమె వెడ్డింగ్ ప్లానర్, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ ఓనర్‌గా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడొస్తున్న టీవీ సీరియల్స్‌పై ఆమె కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. గ్లిసరిన్ లేదంటే విలనీ టైప్ ‘‘టీవీ అనేది అందరికీ అందుబాటులో ఉన్న మీడియం. ప్లస్ చాలా ప్రభావం చూపేది కూడా. అలాంటి టీవీ షోస్‌లో ఆడవాళ్లను శక్తిమంతమైన వాళ్లుగా, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్‌గా చూపించాల్సింది పోయి.. కన్నీళ్లు కార్చే ఎమోషనల్ డిపెండెంట్ విమెన్‌గా.. లేదంటే సాటి మహిళల మీదే కక్ష కార్పణ్యాలతో కత్తిగట్టే విలన్లుగా చూపిస్తున్నారు. నిజంగా జీవితంలో అంత ఘోరంగా ఉంటారా ఎవరైనా? బయట మహిళలు ఎంతమంది మల్టీ టాస్కింగ్‌తో ఇళ్లను చక్కదిద్దుకోవట్లేదు? ఎంతమంది ఒంటరి మహిళలు సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయట్లేదు? అలాంటి వాళ్లను ప్రేరణగా తీసుకొని ఎందుకు సీరియల్స్, షోస్‌ను ప్లాన్ చేయరు? ఈ తరం అమ్మాయిలకు బయట ప్రపంచంలోని జీవితాలే బోల్డెంత స్ఫూర్తినిస్తున్నాయి. ఈ టీవీ సీరియల్స్ ఆ స్ఫూర్తిని చంపేస్తున్నాయి. థాంక్ గాడ్.. ‘ఇంటర్నెట్ వాలా లవ్’ అలాంటి షో కాదు. ఇండిపెండెంట్‌గా.. యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా బతికే ఓ ఉమన్ స్టోరీ ఇది. అందుకే ఈ సీరియల్ చేస్తున్నాను. సినిమా మేకర్స్‌దే కాదు సీరియల్ మేకర్స్ ఆలోచనా ధోరణి కూడా మారాలి. విమెన్ పవర్‌ఫుల్‌గా.. ఇండిపెండెంట్‌గా చూపించే కథలు రాయాలి. ఇప్పుడు మన సొసైటీకి అలాంటి రోల్ మోడల్స్ చాలా అవసరం. అప్పుడే మగవాళ్లకు మహిళల పట్ల కాస్తయినా గౌరవం పెరగొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులూ అమ్మాయిల విషయంలో మారే అవకాశం ఉంటుంది’’ అని చెప్పింది మినిషా లాంబా. ఆపండి ఇక ఇంటర్నెట్ వాలా లవ్‌లో.. ట్రోలింగ్స్ మీద కూడా చురకలు ఉంటాయట. ‘‘మనిషి మొహం పట్టుకొని అవమానించడమో.. తిట్టడమో చేయం కదా! ప్రతి వాళ్లకు వాళ్ల పర్సనల్ చాయిస్ ఉంటుంది. వాళ్లకే సొంతమైన లైఫ్ స్టయిల్ ఉంటుంది. పర్సనల్ చాయిస్ ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి ఎదుటి వాళ్ల గురించి ఏదేదో ఊహించుకుని పబ్లిగ్గా నోరెలా పారేసుకుంటారు?’’ అని నిలదీశారు మినిషా. అకస్మాత్తుగా ఆమె ఎందుకలా స్పందించారనే కదా డౌట్? యెస్.. ఆమె ఆగ్రహానికి రీజన్ ట్రోలింగే. ‘‘సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ ప్లాట్ ఫామ్. సామాజిక, రాజకీయ మార్పుల కోసం ఎన్నో దేశాలు ఈ సోషల్ మీడియాను మంచి మీడియంగా వాడుకున్నాయి. కానీ దురదృష్టమేమంటే చాలా చోట్ల ఇది వ్యక్తిగత వెక్కిరింపులు, ట్రోలింగ్స్కూ వేదికగా మారుతోంది. వ్యక్తుల మీద, వాళ్ల అభిప్రాయాల మీద ఉన్న అక్కసును, కోపాన్ని ట్రోలింగ్స్ ద్వారా తీర్చుకుంటున్నారు ఎంతో మంది. ఇది చాలా తప్పు. ఆదరాభిమానాలు, గౌరవాన్ని పెంపొందించాల్సింది పోయి ద్వేషాన్ని పెంచుతున్నాయి. ఈ ట్రోలింగ్స్ వల్ల మానసికంగా ఏ కొంచెం వీక్‌గా ఉన్నా మనుషులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అమ్మాయిలు, విమెన్ సెలబ్రిటీస్ పట్ల అయితే ఇది మరీ దారుణంగా ఉంది. దయచేసి సెన్సిటివ్‌గా ఆలోచించండి. ట్రోలింగ్స్‌ను ఆపండి. అలాగే ట్రోలింగ్‌కు గురైన వాళ్లు కూడా వీక్‌గా మారొద్దు. జీవితంలో ఇలాంటివి సాధారణమే అనుకొని ఇగ్నోర్ చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. అంతే ధీమాతో వాటిని ఎదుర్కోండి’’అంటూ అమ్మాయిలకు ధైర్యమిస్తున్నారు మినిషా లాంబా. ఇంటర్నెట్ వాలా లవ్ ప్రమోషన్ కోసం ఏ నగరానికి వెళ్లినా ‘స్టాప్ ట్రోలింగ్’ అనే పర్సనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు మినిషా. -
'వంకరచూపులపై వేటు వేయండి'
ముంబై: అశ్లీల వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాన్ని సెలబ్రిటీలు తప్పుబట్టారు. ఈ చర్య సమర్థనీయం కాదని కుండబద్దలు కొట్టారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. Maybe soon, we can expect #Twitter ban, #Facebook ban, #YouTube ban.. Will be back to reading books.. Oh no! They may be banned too — Minissha Lamba (@Minissha_Lamba) August 3, 2015 ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ చూడడంపై కూడా త్వరలో నిషేధం విధిస్తారేమోనని బాలీవుడ్ నటి మినీషా లంబా అనుమానం వ్యక్తం చేసింది. వీటిని నిషేధిస్తే పుస్తకాలు చదువుకోవచ్చు అనుకుంటున్నారా. పుస్తకాలు చదవడంపై కూడా నిషేధం విధిస్తారేమోనని ట్వీట్ చేసింది. Don't ban porn. Ban men ogling, leering, brushing past, groping, molesting, abusing, humiliating and raping women. Ban non-consent. Not sex. — Chetan Bhagat (@chetan_bhagat) August 3, 2015 పోర్న్ సైట్లపై నిషేధం వద్దని ప్రముఖ రచయిత చేతన్ భగత్ కోరారు. వక్రదృష్టి, వంకరచూపులు, కంత్రీతనం, కామాతురత, వేధింపులు, లైంగిక హింస, అణచివేత, అత్యాచారాలను బాన్ చేయాలని డిమాండ్ చేశారు. నీలి చిత్రాల సైట్లపై నిషేధంతో లైంగిక హింస నేరాలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది తెలియడం లేదని నటుడు ఉదయ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ అన్నారు. నిషేధం విధించిన పార్టీకి చెందిన వారే పార్లమెంట్ లో పోర్న్ సైట్లు చూస్తూ దొరికిపోయారని తెలిపారు. మూర్ఖులపై నిషేధం విధించాలని సోనమ్ కపూర్ కోరింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్లు సంధించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఆపేసినట్టుగా కేంద్ర ప్రభుత్వ చర్య ఉందని వర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే పోర్న్ సైట్లను మాత్రమే నిషేధించారు. త్వరలో ప్రభుత్వం పడకగదిలోకి ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. Now they have just banned porn but very soon the Government might come into the bedroom to see how couples are having sex — Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2015 -
ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి
ముంబై: బాలీవుడ్ నటి మినీషా లంబా తన చిరకాల ప్రియుడు రియాన్ థామ్ ను సోమవారం వివాహం చేసుకుంది. ముంబైలో జరిగిన వీరి వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 30 ఏళ్ల మినీషా లంబా చివరిసారిగా సెలబ్రిటీ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో కనిపించింది. మినీషా, రియాన్ లకు పెళ్లైన విషయాన్ని నటి పూజా బేడి ట్విటర్ ద్వారా వెల్లడించింది. వివాహ విందు సందర్భంగా దిగిన గ్రూపు ఫోటోను షేర్ చేసింది. 'హేపీ మ్యారీడ్ లైఫ్' అంటూ శుభాకాంక్షలు తెలిపింది. తన సోదరుడిని పెళ్లాడిన మినీషాను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. 2005లో విడుదలైన యహాన్ సినిమాతో మినీషా బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసింది. హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెల్డన్ అబ్బా, బెజా ఫ్రై 2 తదితర చిత్రాల్లో నటించింది.