ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి | Minissha Lamba marries longtime boyfriend Ryan Tham | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి

Published Tue, Jul 7 2015 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి

ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి

ముంబై: బాలీవుడ్ నటి మినీషా లంబా తన చిరకాల ప్రియుడు రియాన్ థామ్ ను సోమవారం వివాహం చేసుకుంది. ముంబైలో జరిగిన వీరి వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 30 ఏళ్ల మినీషా లంబా చివరిసారిగా సెలబ్రిటీ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో కనిపించింది.

మినీషా, రియాన్ లకు పెళ్లైన విషయాన్ని నటి పూజా బేడి ట్విటర్ ద్వారా వెల్లడించింది. వివాహ విందు సందర్భంగా దిగిన గ్రూపు ఫోటోను షేర్ చేసింది. 'హేపీ మ్యారీడ్ లైఫ్' అంటూ శుభాకాంక్షలు తెలిపింది. తన సోదరుడిని పెళ్లాడిన మినీషాను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది.

2005లో విడుదలైన యహాన్ సినిమాతో మినీషా బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసింది. హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెల్డన్ అబ్బా, బెజా ఫ్రై 2 తదితర చిత్రాల్లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement