
నెంజుక్కు నీతి మూవీ ట్రైలర్ ఆవిష్కరణ
తమిళసినిమా: నెంజుక్కు నీతి చిత్ర టైటిల్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశామని నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి శివాని రాజశేఖర్, తాన్య రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రొజెక్ట్స్ సంస్థలతో కలిసి రెమో పిక్చర్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌రాజ్ కామ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీపునీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
కాగా సోమవారం సాయంత్రం నిర్వహించిన చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన తాత కరుణానిధికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రం టైటిల్ ఆయన ఇచ్చిందేనని పేర్కొన్నారు. నిర్మాత బోనీ కపూర్ ఫోన్ చేసి ఆర్టికల్ 15 హిందీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేద్దామని చెప్పగా దర్శకత్వం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాంటి సమయంలో ‘కణా’ చిత్రాన్ని చూసి అరుణ్‌రాజ్ కామరాజును పిలిపించగా ఆయన వెంటనే చేద్దామని చెప్పారన్నారు. నెంజుక్కు నీతి టైటిల్ గురించి తన తండ్రి స్టాలిన్‌కు చెప్పగా జాగ్రత్తగా చేయండని అన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment