
సీనియర్ హీరో జీవిత రాజశేఖర్‌ల ముద్దుల తనయ శివానీ రాజశేఖర్ తాజాగా తమిళంలో క్రేజీ ఛాన్స్‌ను కొట్టేసింది. ఇప్పటికే గుహన్ దర్శకత్వంలో ఆమె ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదిత్ అరుణ్ సరసన చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ గ్యాప్‌లోనే ‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జతో మరో మూవీకి సైన్ చేసింది శివానీ. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫాంటసీ లవ్ స్టోరీ మూవీని మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పుడు హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్ 15’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో శివానీ సరసన తమిళనాడు సీఎంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించనున్నారు. అరుణ్‌రాజ కామరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బోనీకపూర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు.
చదవండి : ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ?
గజిని తమిళ నిర్మాత కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment