
‘స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ‘జిలేబి’ సినిమా షురూ అయింది. శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ కథానాయిక. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో ఎస్‌ఆర్కే బ్యానర్‌పై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇచ్చారు.
డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ స్క్రిప్‌్టని యూనిట్‌కి అందించారు. కె. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘చాలా విరామం తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జిలేబి’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సతీష్ ముత్యాల.
Comments
Please login to add a commentAdd a comment