
శివానీ రాజశేఖర్, విష్ణు విశాల్
తొలి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను నమస్కారం అని పలకరించక ముందే తమిళ ఆడియన్స్‌కు కూడా వణక్కం చెప్పడానికి సిద్ధమయ్యారు శివానీ రాజశేఖర్.. డాటరాఫ్ జీవితా రాజశేఖర్. అడవి శేష్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు శివానీ. కానీ, ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ తమిళ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు.
విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. విష్ణు విశాల్ సొంత ప్రొడక్షన్ సంస్థ వీవీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధురైలో ఫుల్ స్పీడ్‌తో జరుగుతోంది. సో.. ఇటు నమస్కారంతో పాటు అటు వణక్కం ఒకేసారి చెప్పడానికి రెడీ అయ్యారన్నమాట శివానీ.
Comments
Please login to add a commentAdd a comment