స్టార్ డైరెక్టర్ తో తొలి సినిమా..! | shivani Rajashekar In prabhusolomon Film | Sakshi
Sakshi News home page

స్టార్ డైరెక్టర్ తో తొలి సినిమా..!

Published Sat, Jul 8 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

స్టార్ డైరెక్టర్ తో తొలి సినిమా..!

స్టార్ డైరెక్టర్ తో తొలి సినిమా..!

తమిళసినిమా: దర్శకుడు ప్రభుసాల్మన్ చిత్రాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో లొకేషన్స్ కూడా ఒక పాత్రలా ఉంటాయి. సాధ్యమైనంతవరకు ఫ్రెష్‌ లొకేషన్స్ను ఎంచుకుంటారు. ఇక ఆయన చిత్రాల్లో కొత్త వారికి నటించే అవకాశం వచ్చిందంటే వారి పంట పండినట్లే. కుంకీతో లక్ష్మీమీనన్ను పరిచయం చేసిన ఘనత ప్రభుసాల్మన్దే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ మధ్య తెలుగమ్మాయి ఆనందిని కయల్‌ చిత్రంతో కయల్‌ ఆనందిగా మార్చారు. స్టార్‌ నటుడు ధనుష్‌తో చేసిన తొడరి చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తన తాజా చిత్రానికి కొత్తవారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అదే విధంగా ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన చక్కని ప్రేమకథా దృశ్యకావ్యం కుంకీ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి రెడీ అయ్యారు.

ఇందులో కుంకీ చిత్ర జోడీ విక్రమ్‌ప్రభు, లక్ష్మీమీనన్లే నటిస్తారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత కాళిదాస్‌ జయరామ్‌ నటించనున్నారనే టాక్‌ హల్‌చల్‌ చేసింది. అయితే ప్రభుసాల్మన్ మాత్రం మళ్లీ కొత్తవారినే నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన కథకు తగ్గ నటీనటుల అన్వేషణలో పడ్డారు. కాగా ఇప్పుడాయన కథకు తగ్గ నాయకి లభించిందన్నది తాజా వార్త.

మరో నట వారసురాలిని తెరంగేట్రం చేయడానికి ప్రభుసాల్మన్ సిద్ధం అయ్యారని తెలిసింది. ఆమె ఎవరో కాదు నట దంపతులు రాజశేఖర్‌–జీవితల పెద్ద కూతురు శివాని అని ప్రచారం జరుగుతోంది. విషయమేమింటంటే ఈ అమ్మడు ఇటీవలే తాను ముందుగా కోలీవుడ్‌లోనే నాయకిగా పరిచయం అవుతానని స్టేట్‌మెంట్‌ ఇచ్చేసిందన్నది గమనార్హం. మరి ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించే అవకాశం వరించిందంటే శివానికి నిజంగా లక్కే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement