
సినీరంగంలో తారల వారసుల ఎంట్రీకి ఎప్పుడూ రెడ్‌కార్పెటే ఉంటుంది. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలా మరో వారసురాలి కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. దక్షిణాదిలో నట దంపతులుగా పేరొందిన వారిలో రాజశేఖర్, జీవిత జంట ఒకటి. ముందుగా వీరు కోలీవుడ్‌లోనే నటనకు శ్రీకారం చుట్టారు.
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఈ నట దంపతుల వారుసురాలు శివాని రాజశేఖర్ కథానాయకిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఓకెసారి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు శివాని. ఇప్పటికే ‘2 స్టేట్స్’చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విష్ణువిశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో శివాని నాయకిగా ఎంపికయ్యారు.
ఇది జల్లికట్టు నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. మలయాళంలో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్‌మోహన్‌లాల్‌కు కూడా జంటగా ఎంపికైందని మరోవార్త. మొత్తం మీద ఒక చిత్రం కూడా తెరపైకి రాకుండానే మరో రెండు భాషల్లో ఎంట్రీకి రెడీ అయిపోతోంది ఈ బ్యూటీ. ఏ భాషలో శివానిని సెక్సెస్ వరిస్తుందో?.. ముద్దుగుమ్మ లక్కు ఎలా ఉంటుందో! వేచిచడాల్సిందే. వైద్యవిద్యను అభిసించిన శివాని సినిమాలపై మక్కువతో డాన్స్, నటనలో శిక్షణతీసుకుంది. ఇలా నటిగా అన్ని అర్హతలు పొందిందింది. ఇక తన నట విశ్వరూపాన్ని నిరూపించుకోవడమే తరువాయి.
Comments
Please login to add a commentAdd a comment