హీరోగా ఎంట్రీ ఇస్తున్న విష్ణు విశాల్‌ సోదరుడు | Vishnu Vishal Brother Rudra Debut As Hero With Oho Enthan Baby Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Vishnu Vishal: హీరోగా విష్ణు విశాల్‌ సోదరుడు.. హీరోయిన్‌ ఎవరంటే?

Published Wed, Feb 14 2024 2:58 PM | Last Updated on Mon, Feb 26 2024 5:53 PM

Vishnu Vishal Brother Rudra Debut as Hero - Sakshi

చిత్ర పరిశ్రమలో సినీ తారల పిల్లలు, తోబుట్టువులు ఇండస్ట్రీకి పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ కోవలోనే కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్‌ తమ్ముడు రుద్ర కూడా వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో విష్ణు విశాల్‌ తమ్ముడు రుద్ర కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'ఓహో ఎన్‌దన్‌ బేబీ'. ఈ సినిమాకు దర్శకనటుడు కృష్ణకుమార్‌ రామ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్‌ నటి మిథిలా పాల్కర్‌ కథనాయికగా నటిస్తోంది. కోలీవుడ్‌లో ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా, ముల్‌ నీ ముడివుమ్‌ నీ వంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన తర్పుగ శివ ఓహో ఎన్‌దన్‌ బేబీ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మరో రెండు వారాలపాటు ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ కొనసాగనుంది. తర్వాత గోవా, పాండిచ్చేరి వంటి వివిధ ప్రాంతాలలో మలి విడత షూటింగ్‌ జరపనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

- పోడూరి నాగ ఆంజనేయులు

చదవండి: బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష ఖరారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement