![Matti Kusthi Combo Repeat: Vishnu Vishal, Chella Ayyavu Once Again Collaborated - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/24/vishnu-vishal.jpg.webp?itok=6etVkbQ4)
హీరో విష్ణువిశాల్ నటించిన హిట్ చిత్రాల్లో కట్టకుస్తీ ఒకటి. ఇది తెలుగులో మట్టి కుస్తీ పేరిట విడుదలైంది. 2022 డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. విష్ణు విశాల్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా ఆయువు దర్శకత్వం వహించారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా గత ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తమిళ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది.
విష్ణు విశాల్, దర్శకుడు సెల్లా ఆయువు తాజాగా మరో చిత్రానికి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. దీని గురించి విష్ణు విశాల్ వీడియోస్ సంస్థ మంగళవారం మీడియాకు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వేలైను వందుట్టా వెళ్‌లైక్కారన్, కట్ట కుస్తీ, ఎఫ్‌ఐఆర్ వంటి 10 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తమ సంస్థ నిర్మిస్తున్న 11వ చిత్రం ఇది అని తెలిపారు.
ఇది కుటుంబ సపరివార సమేతంగా చూసి ఆనందించే పూర్తి వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో ప్రముఖ తారాగణం, సాంకేతిక వర్గం పని చేయనున్నారని, ప్రస్తుతం చిత్ర ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి
Comments
Please login to add a commentAdd a comment