మరింత యంగ్‌గా ఉన్నానని రిజెక్ట్‌ చేశారు: బుట్టబొమ్మ | Pooja Hegde reveals being rejected for a movie in Audition | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆడిషన్స్‌కు వెళ్లేందుకు సిగ్గుపడను.. ఎందుకంటే: పూజా హెగ్డే

Published Fri, Apr 4 2025 6:55 PM | Last Updated on Fri, Apr 4 2025 7:22 PM

Pooja Hegde reveals being rejected for a movie in Audition

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు సల్మాన్ ఖాన్‌ సరసన కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్‌ చిత్రంలో కనిపించిన ముద్దుగుమ్మ.. ఇటీవలే దేవా మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బుట్టబొమ్మకు అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెట్రో, జన నాయగన్‌ లాంటి సినిమాల్లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సరసన హై జవానీ తో ఇష్క్ హోనా హైలో కూడా పూజా నటించనుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ఇటీవల ఓ తమిళ చిత్రం కోసం ఆడిషన్‌కు వెళ్లగా తనను తిరస్కరించారని బుట్టబొమ్మ తెలిపింది. అయితే తనను ఎందుకు రిజెక్ట్‌ చేశారో కూడా వివరించింది. ఆ పాత్రకు నా వయస్సు సరిపోదని.. అందువల్లే తిరస్కరించినట్లు పూజా వెల్లడించింది. నా కంటే కాస్తా ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఎంపిక చేశారని పూజా చెప్పుకొచ్చింది.

ఇలా ఆడిషన్స్‌కు వెళ్లడం వల్ల ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సహాయపడుతుందని పూజా హెగ్డే పేర్కొంది. తాను ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం మేకర్స్‌కు కలిగించడమే నా ఉద్దేశమని చెప్పింది. తాను కష్టపడి పని చేయడానికి వెనకాడనని.. ఆడిషన్స్‌కు వెళ్లేందుకు అహంకారం ప్రదర్శించనని తెలిపింది. అ ఏదేమైనా ఒక నటిగా ఆడిషన్స్‌కు వెళ్లడానికి తాను ఎప్పుడు సిగ్గుపడనని అంటోంది మన బుట్టబొమ్మ.

కాగా.. పూజా హెగ్డే ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న రెట్రో మూవీలో కనిపించనుంది. కోలీవుడ్ స్టార్‌ సూర్య సరసన నటిస్తోంది. అంతేకాకుండా దళపతి విజయ్‌ మూవీ జన నాయగన్‌లో హీరోయిన్‌గా మెప్పించనుంది. బీస్ట్ తర్వాత విజయ్‌తో కలిసి పనిచేయనుంది.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement