ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు ప్రియుడితో దుబాయ్‌కు చెక్కేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వార్త రాజశేఖర్ ఫ్యామిలీ కంట పడినట్లు కనిపిస్తోంది. ఇంకేముంది రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక సదరు వార్తపై మండిపడ్డారు. ఈ మేరకు శివాత్మిక రాజశేఖర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది.
'ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరో? నెక్స్ట్ లెవల్ న్యూస్ రాస్తున్నారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి. బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి' అంటూ ఫైర్ అయింది. కాగా శివాత్మిక ప్రస్తుతం 'పంచతంత్రం' సినిమా చేస్తోంది. జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'శేఖర్' సినిమాలో శివానీ ఓ ముఖ్యపాత్ర పోషించింది.
చదవండి: ఏడేళ్ల లవ్.. చూడకూడని స్థితిలో బావను చూశాను: అరియానా బ్రేకప్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment