అప్పులకోసం ఆస్తుల జప్తు | assets handover for Debts | Sakshi
Sakshi News home page

అప్పులకోసం ఆస్తుల జప్తు

Published Tue, Jan 7 2014 6:01 AM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM

assets handover for Debts

ఆత్మకూర్, న్యూస్‌లైన్: తీసుకున్న రుణానికి చెందిన బకాయిలను చెల్లించాలంటూ జిల్లా సహకార బ్యాంకు అధికారులు సం బంధితుల వస్తువులను జప్తు చేయడంతో సోమవారం ఆత్మకూర్ మం డలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ గ్రామానికి చెందిన 80మంది డీసీసీబీ బ్యాంకు, విండో సహకార సంఘం ద్వారా  2010-11లో రూ.కోటికిపైగా రుణాలు పొందారు. తదనంతరం వారు రున బకాయిలను చెల్లిం చకపోవడంతో బ్యాంకు అధికారులు విండో సిబ్బంది గ్రామానికి చేరుకొని వారి సామాన్లను జప్తు చేశారు. దీంతో లబ్దిదారులు, బ్యాంకు అధికారుల మధ్య వాగ్వివాదం చో టు చేసుకుంది.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు ఎలా జప్తు చేస్తారని గ్రామానికి చెందిన రామకృష్ణ, వెంకటేష్, మొగులయ్యలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్న ఇంటి తలుపులు, టీవీలు, తీసుకెళితే అవమానంతో తలెత్తుకోగలమా? అని నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెబుతూ గతంలోనే నోటీసులు అం దించామని, అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో నే సామాన్లు జప్తు చేస్తున్నామన్నారు. తీసుకున్న బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఈ వ సూళ్ల కార్యక్రమంలో డీసీసీబీ డీజీఎం వెంకట స్వామి, ఆత్మకూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ ఎండీ యూసుఫ్, ఫీల్డ్ ఆఫీసర్ శేఖర్, అదికారులు జగదీశ్వర్‌రెడ్డి, నరేష్, మాసన్న, రఘులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement