District Co-operative bank
-
రిబేటు.. డౌటే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వాయిదాల ప్రకారం రుణాలు చెల్లించినవారికి ఇవ్వాల్సిన ‘రిబేటు’కు రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. తొమ్మిదేళ్లు గడిచినా ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ కాకపోవడం అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 2009 నుంచి ఇప్పటివరకు 15,130 మంది రైతులకు రూ.300 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేశారు. అప్పులు పొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు కోళ్లఫారాలు, డెయిరీ ఫామ్‌లు నిర్వహిస్తూ, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరు ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 31వ తేదీ)లోపు నిర్దేశించిన వాయిదా సొమ్ము జమ చేస్తే అప్పు కింద కట్టే వడ్డీలో 6శాతం తగ్గింపును ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పౌల్ట్రీ, డెÆయిరీ నిర్వహణలో నష్టం వచ్చినా, వ్యాధులు సోకి గొర్రెలు, మేకలు మృత్యువాతపడినా.. అప్పులు చేసి నగలు తాకట్టు కుదవ పెట్టి గడువులోపే కిస్తీలు కట్టారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సహకార సంఘాలు: 48 మొత్తం సభ్యుల సంఖ్య: 64,100 2009 నుంచి జరిగిన రుణ వితరణ: రూ.300 కోట్లు వాయిదాలు సకాలంలో చెల్లించిన రైతులు: 15,130 వడ్డీలో 6% శాతం తగ్గింపు రూపేణా అందాల్సింది: రూ.8.13 కోట్లు రూ.8.13 కోట్ల మేర బకాయి రిబేటు రూపేణా సహకార సంఘాల సభ్యులకు రూ.8.13 కోట్ల మేర రావాల్సివుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సకాలంలో ఈ నిధులు విడుదలయ్యాయి. ఆయన మరణానంతరం వడ్డీ తగ్గింపు నిధుల ఊసే లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేళ్లుగా ఈ నిధుల కోసం రైతాంగానికి ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పట్లో నిర్ణీత వ్యవధిలో ఈ సొమ్ము రైతుల పద్దులో జమ కావడంతో సకాలంలో అప్పులు చెల్లించేందుకు మొగ్గు చూపేవారు. ఈసారి కూడా రిబేటు బకాయిలు విడుదల చేయకపోతే మార్చిలో చెల్లించాల్సిన వాయిదాలను వాయిదా వేస్తామని అన్నదాతలు అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర మండలాల్లో వేలాది మంది రైతులు దీర్ఘాకాలిక రుణాలు పొందారు. డిస్కౌంట్ నిధులను ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని పీఏసీఎస్ చైర్మన్లు.. డీసీసీబీ పాలకవర్గం దృష్టికి తెచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కావడంతో డీసీసీబీ మిన్నకుండిపోయింది. బకాయిలు వాస్తవమే రైతులకు 6శాతం వడ్డీ రాయితీ బకాయి పడ్డ మాట వాస్తవమే. ఈ అంశంపై కొంతకాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాం. వారం, పది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశముంది. నిధులు రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – సింగిరెడ్డి పెంటారెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
బ్యాంకు సిబ్బందిపై దాడి : రూ. 70 లక్షలు లూటీ
ఘజియాబాద్: బ్యాంక్ ప్రధాన బ్రాంచి నుంచి వివిధ బ్యాంకు శాఖలకు తరలిస్తున్న భారీ నగదును దుండగులు సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఆ ఘటన హపూర్ జిల్లాలోని దాలునా పట్టణంలో నిన్న చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి దాదాపు రూ. 60 లక్షల నగదు... ఆదే పట్టణంలోని రెండు శాఖలకు తరలించారు. ఆ క్రమంలో ముందుగా వశిష్ట చౌక్‌లో సహకార బ్యాంక్ బ్రాంచ్ వద్దకు నగదుతో ఉన్న వాహనం చేరుకుంది. ఆ నగదును వాహనం నుంచి బ్యాంకులోకి తరిలిస్తున్న క్రమంలో... అప్పటికే అక్కడ ఆరు మోటర్ సైకిళ్లపై మాటువేసిన దుండగులు ఒక్కసారిగా నగదు తీసుకువెళ్తున్న సిబ్బందిపై దాడి చేసి రూ.60 లక్షలు దోచుకున్నారు. అనంతరం వాహనంలో వచ్చిన అధికారులు సిబ్బందితోపాటు బ్యాంకులోని అధికారులను గదిలో బందించి.... బ్యాంకులో నిల్వ ఉన్న నగదు రూ. 10 లక్షలు కూడా దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుమందు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలతోపాటు కంప్యూటర్లను కూడ ఆగంతకులు ధ్వంసం చేశారు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు చెప్పారు. -
అప్పులకోసం ఆస్తుల జప్తు
ఆత్మకూర్, న్యూస్‌లైన్: తీసుకున్న రుణానికి చెందిన బకాయిలను చెల్లించాలంటూ జిల్లా సహకార బ్యాంకు అధికారులు సం బంధితుల వస్తువులను జప్తు చేయడంతో సోమవారం ఆత్మకూర్ మం డలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ గ్రామానికి చెందిన 80మంది డీసీసీబీ బ్యాంకు, విండో సహకార సంఘం ద్వారా 2010-11లో రూ.కోటికిపైగా రుణాలు పొందారు. తదనంతరం వారు రున బకాయిలను చెల్లిం చకపోవడంతో బ్యాంకు అధికారులు విండో సిబ్బంది గ్రామానికి చేరుకొని వారి సామాన్లను జప్తు చేశారు. దీంతో లబ్దిదారులు, బ్యాంకు అధికారుల మధ్య వాగ్వివాదం చో టు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు ఎలా జప్తు చేస్తారని గ్రామానికి చెందిన రామకృష్ణ, వెంకటేష్, మొగులయ్యలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్న ఇంటి తలుపులు, టీవీలు, తీసుకెళితే అవమానంతో తలెత్తుకోగలమా? అని నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెబుతూ గతంలోనే నోటీసులు అం దించామని, అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో నే సామాన్లు జప్తు చేస్తున్నామన్నారు. తీసుకున్న బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఈ వ సూళ్ల కార్యక్రమంలో డీసీసీబీ డీజీఎం వెంకట స్వామి, ఆత్మకూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ ఎండీ యూసుఫ్, ఫీల్డ్ ఆఫీసర్ శేఖర్, అదికారులు జగదీశ్వర్‌రెడ్డి, నరేష్, మాసన్న, రఘులు ఉన్నారు.