టాలీవుడ్ ప్రస్తుత జనరేషన్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్)
'వదిన మిస్ యూ. ఎంతో బాధని అనుభవించావు. అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్. నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్. పాజిటివిటీని పెంచావ్. నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడు మాతోనే ఉంటావ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని శేఖర్ మాస్టర్ రాసుకొచ్చాడు.
శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె.. తన భార్యకు అక్క అని తెలుస్తోంది. అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు. ప్రస్తుతానికైతే శేఖర్ మాస్టర్.. డ్యాన్స్ షోలో పెద్దగా కనిపించట్లేదు.
(ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment