ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట | SP shelters couple love | Sakshi
Sakshi News home page

ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

Published Wed, Aug 31 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించిన ఓ ప్రేమజంట భద్రత కల్పించాలని కోరుతూ ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆశ్రయించింది. తిరువళ్లూరు జిల్లా  తిరుత్తణి సమీపంలోని కున్నత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు సునీల్‌దేవ్, అరక్కోణంలోని ఇచ్చిపుత్తూరు గ్రామానికి చెందిన కీర్తనలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కీర్తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు రావడంతో వీరు ఎస్పీ శ్యాంసన్‌కు వినతి పత్రం సమర్పించారు. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement