Kirtana
-
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సురేష్ కాళ్లు పట్టుకుని నదిలో నెట్టేశాడు
తెనాలిరూరల్: తన తల్లిని, చెల్లిని కాళ్లు పట్టుకుని సురేష్ నదిలోకి నెట్టేశాడని మృత్యుంజయురాలు లక్ష్మీసాయికీర్తన తెలిపింది. తెనాలిలోని తన పెద్దమ్మ సంరక్షణలో ఉన్న బాలిక మంగళవారం విలేకర్లతో మాట్లాడింది. షాక్ నుంచి ఇంకా తేరుకోని బాలిక భోరుమంటూనే తన కళ్ల ముందే జరిగిన భయానక దుర్ఘటన గురించి వివరించింది. కారు కొన్నానంటూ సురేష్ తన తల్లి సుహాసినితోపాటు తనను, తన చెల్లి జెర్సీని తీసుకెళ్లాడని, గోదావరి నదిని చూద్దామని, ఫొటోలు దిగుదామని కారు ఆపాడని తెలిపింది. అక్కడ వంతెన రెయిలింగ్ వద్ద నిలబడి ఉండగా తన తల్లి కాళ్లు పట్టుకుని నదిలోకి నెట్టేశాడని, ఏడాది వయసున్న తన చెల్లిని నదిలోకి విసిరేశాడని తెలిపింది. తనను నెట్టేయగా, పైపు ఆసరా దొరకడంతో పట్టుకుని ఉన్నట్టు వెల్లడించింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడుతూ వంతెన వద్దకు వచ్చారని, హారన్ మోగిస్తూ వినపడుతుందా అని అడుగుతూ, నదిలోకి టార్చిలైటు వేసి కనబడుతుందా అని అడుగుతూ విజిల్ వేసుకుంటూ వచ్చి తన ఆచూకీ గుర్తించి కాపాడారని తెలిపింది. -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
ఇలవరసి కుమారుడు వివేక్ సతీమణి కీర్తన ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: శశికళ వదిన ఇలవరసి కుమారుడు వివేక్. ఇతడి భార్య కీర్తన గురు వారం ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని ఆమె వదినమ్మ ఇలవరసి కూడా అనుభవించారు. శశికళ అన్న జయరామన్ సతీమణే ఈ ఇలవరసి. ఆమె కుమారుడు వివేక్. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ఇతడి కనుసన్నుల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది. దీంతో వివేక్‌ను ఈడీ, ఐటీ వర్గాలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వివేక్ తన సతీమణి కీర్తనతో గత కొంత కాలంగా తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. వివేక్ వేధింపుల గురించి పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వివేక్‌ను ఎవ్వరూ ప్రశ్నించక పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పలు రకాల మాత్రలను మింగేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను అర్ధరాత్రి వేళ అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వివేక్, కీర్తన మధ్య బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు విచారణలో వెలుగు చూసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన కీర్తన ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట
తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించిన ఓ ప్రేమజంట భద్రత కల్పించాలని కోరుతూ ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆశ్రయించింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని కున్నత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు సునీల్‌దేవ్, అరక్కోణంలోని ఇచ్చిపుత్తూరు గ్రామానికి చెందిన కీర్తనలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కీర్తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు రావడంతో వీరు ఎస్పీ శ్యాంసన్‌కు వినతి పత్రం సమర్పించారు. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.