తెనాలిరూరల్: తన తల్లిని, చెల్లిని కాళ్లు పట్టుకుని సురేష్ నదిలోకి నెట్టేశాడని మృత్యుంజయురాలు లక్ష్మీసాయికీర్తన తెలిపింది. తెనాలిలోని తన పెద్దమ్మ సంరక్షణలో ఉన్న బాలిక మంగళవారం విలేకర్లతో మాట్లాడింది. షాక్ నుంచి ఇంకా తేరుకోని బాలిక భోరుమంటూనే తన కళ్ల ముందే జరిగిన భయానక దుర్ఘటన గురించి వివరించింది.
కారు కొన్నానంటూ సురేష్ తన తల్లి సుహాసినితోపాటు తనను, తన చెల్లి జెర్సీని తీసుకెళ్లాడని, గోదావరి నదిని చూద్దామని, ఫొటోలు దిగుదామని కారు ఆపాడని తెలిపింది. అక్కడ వంతెన రెయిలింగ్ వద్ద నిలబడి ఉండగా తన తల్లి కాళ్లు పట్టుకుని నదిలోకి నెట్టేశాడని, ఏడాది వయసున్న తన చెల్లిని నదిలోకి విసిరేశాడని తెలిపింది.
తనను నెట్టేయగా, పైపు ఆసరా దొరకడంతో పట్టుకుని ఉన్నట్టు వెల్లడించింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడుతూ వంతెన వద్దకు వచ్చారని, హారన్ మోగిస్తూ వినపడుతుందా అని అడుగుతూ, నదిలోకి టార్చిలైటు వేసి కనబడుతుందా అని అడుగుతూ విజిల్ వేసుకుంటూ వచ్చి తన ఆచూకీ గుర్తించి కాపాడారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment