‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసం భారీ సెట్‌:వామ్మో.. అన్ని కోట్లా! | Ravi Teja Tiger Nageswara Rao Set Worth 7Crs To Recreate Village Back Ground | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao : ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసం భారీ సెట్‌.. ఎన్ని కోట్లంటే..

Published Sun, Apr 17 2022 11:18 AM | Last Updated on Sun, Apr 17 2022 12:36 PM

Ravi Teja Tiger Nageswara Rao Set Worth 7Crs To Recreate Village Back Ground - Sakshi

ఏడు కోట్ల రూపాయలతో స్టూవర్టుపురం రూపుదిద్దుకుంటోంది. రవితేజ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. తాజాగా ఈ సినిమా కోసం 1970 కాలం నాటి స్టూవర్టుపురం విలేజ్‌ సెట్‌ను రెడీ చేస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలో ఏడు కోట్ల రూపాయలతో ఐదెకరాల విస్తీర్ణంలో ఈ సెట్‌ వర్క్‌ జరుగుతోంది. ‘మహానటి, జెర్సీ, ఎవరు, శ్యామ్‌ సింగరాయ్‌’ వంటి సినిమాలకు వర్క్‌ చేసిన ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా పర్యవేక్షణలో ఈ సెట్‌ వర్క్‌ జరుగుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి మయాంక్‌ సింఘానియా సహనిర్మాత. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement