సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలిని విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో మంత్రితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.
పదో షెడ్యూల్‌లో ఉన్న మండలి విభజనలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని టీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఏపీ ఉన్నత విద్యామండలి విభ జనకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. పదేళ్లపాటు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశాల విధానం అయినందున పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలా? కలిపి నిర్వహిద్దామా? అనేది తరువాత తేల్చుకుందామని, ముందుగా తెలంగాణలో షెడ్యూలుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం.
సెట్స్ షెడ్యూల్‌కు చర్యలు చేపట్టండి
Published Tue, Oct 14 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM
Advertisement
Advertisement