
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవలె ఓ వీడియో రిలీజ్ చేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్న సాయితేజ్ తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్సిడెంట్‌లో కోలుకున్న అనంతరం ఆయన నటిస్తున్న తొలి చిత్రం కావడంతో చిత్ర యూనిట్ సహా అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.
దీంతో థ్యాంక్యూ చెబుతూ సాయితేజ్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. ఇక సాయితేజ్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం పట్ల వరుణ్ తేజ్ స్పందిస్తూ.. 'నిన్ను సెట్స్‌పై మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉంది బావా. లవ్ యూ' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
So happy to see you back on sets bava!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 29, 2022
Love you.🤗
More power to you!
Good luck for #SDT15 🤜🏽🤛🏽 https://t.co/EW5z3rOmTH