బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్‌లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX
— Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024
Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥
Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc— αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment