Nidhi Agarwal Plays Female Lead Role In Udhayanidhi Stalin Kalaga Thalaivan Movie - Sakshi
Sakshi News home page

Nidhi Agarwal: ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన నిధి అగర్వాల్‌

Published Fri, Jul 29 2022 3:56 PM | Last Updated on Fri, Jul 29 2022 4:23 PM

Nidhi Agarwal Plays Female Lead Role in Udhayanidhi Stalin Kalaga Thalaivan Movie - Sakshi

నెంజుక్కు నీది సినిమా తరువాత ఉదయనిధి స్టాలిన్‌ మారీ సెల్వరాజ్‌ దర్శకత్వంలో మామన్నన్‌ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తీ సురేష్, వడివేలు, భగత్‌ బాసిల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ స్థితిలో మజిద్‌ తిరుమేని దర్శకత్వంలో ఉదయనిధి కొత్త చిత్రంలో నటిస్తారని రెండేళ్ల క్రితమే ప్రకటించింది.

కాగా ఈ చిత్ర బృందం ఇప్పుడు సినిమా టైటిల్‌ను వెల్లడించింది. కలగ తలైవన్‌ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నిధి అగర్వాల్‌ నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ దేవా, అరోల్‌ కొరెల్లి సంగీతం అందిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement