Nidhhi Agerwal: పట్టిస్తే లక్ష రూపాయల నజరానా! | Nidhhi Agerwal Post On Pet Missing Went Viral | Sakshi
Sakshi News home page

Nidhhi Agerwal: పట్టిస్తే లక్ష రూపాయల నజరానా!

May 13 2021 8:09 AM | Updated on May 13 2021 8:09 AM

Nidhhi Agerwal Post On Pet Missing Went Viral - Sakshi

అది మిస్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దాన్ని పట్టించిన వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ తెగ హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కుక్కపిల్ల మిస్‌ అయినట్లు పోస్ట్‌ పెట్టింది. దాన్ని పట్టించిన వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కోకో అనే పేరున్న ఆ కుక్కపిల్ల కనిపించినట్లైతే ఫొటోలో ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించింది. మొత్తానికి ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక నిధి కెరీర్‌ విషయానికి వస్తే.. 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో కాలు మోపింది. 'మిస్టర్‌ మజ్ను'తో డిజాస్టర్‌ అందుకుంది. కానీ బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిలైన ఈ సినిమా నిధికి మంచి ఆఫర్స్‌ను అందించింది. అలా 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో హీరోయిన్‌గా ఛాన్స్‌ చేజిక్కుంచుకుంది. ఇది సూపర్‌ హిట్‌ కావడంతో నిధికి మళ్లీ వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అశోక్‌ గల్లా హీరోగా వస్తోన్న చిత్రంలోనూ కథానాయికగా కనువిందు చేయనుంది.

చదవండి: మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement