
హీరోయిన్లు చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఛాన్సుల్ని అందుకునే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం తొలి మూవీ చేసేటప్పుడు వింతైన కండీషన్ పెట్టారట. అది చూసి ఈమె షాకైందట.
(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)
''మున్నా మైకేల్' మూవీతో నా కెరీర్ మొదలైంది. ఇదో బాలీవుడ్ మూవీ. టైగర్ ష్రాఫ్ హీరో. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో ఓ కాంట్రాక్ట్ పై సంతకం చేయించారు. అందులో నో డేటింగ్ అనే కండీషన్ కూడా ఉంది. అంటే సినిమా పూర్తయ్యేవరకు హీరోతో నేను డేటింగ్ చేయకూడదనమాట.కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఇవన్నీ గమనించలే గానీ తర్వాత వీటి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు చేస్తున్న నిధి.. ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. 'మంచి, చెడు చెప్పడానికి పద్ధతి ఉంది. హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడటం మాత్రం సరికాదు. నేను అస్సలు ఇలాంటివి పట్టించుకోను' అని నిధి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా)
Comments
Please login to add a commentAdd a comment