
పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu ) సినిమా మే 9న రిలీజ్ కానుంది. సరిగ్గా 50 రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే విడుదల విషయంలో పలుమార్లు తేదీలు మారుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal) భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆపై ఈ చిత్రానికి ప్రధాన బలం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అని తెలిసిందే. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా లీడ్ తీసుకునేది మాత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పాలి.
హరిహర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. తన స్టార్‌డమ్ వల్ల సినిమా ఆడేస్తుందిలే అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు ఉన్నారు. వాస్తవంగా ఆయన తన సినిమాల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.. ఆపై ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అస్సలు ఇటువైపు చూసే ఛాన్స్ లేదు. అయితే, దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానాకి దాదాపు రాకపోవచ్చనే సందేహాలు వస్తున్నాయి. రెండో దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేరని తెలిసిందే. అయితే, ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారం కోసం మిగిలిన ఏకైకా పెద్ద దిక్కుగా నిధి అగర్వాల్ మాత్రమే మిగిలిందని చెప్పవచ్చు.

‘హరి హరవీరమల్లు’ విడుదల కోసం నిధి అగర్వాల్ చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని కూడా తన భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో పలు టీవీ షోలలో పాల్గొని తనదైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులకు దగ్గరౌతుంది. సుమారు ఇంకో 20రోజుల పాటు ‘హరి హరవీరమల్లు’ ప్రచారంలో ఆమె ఉండనున్నారు. అందులో భాగంగా ఆమె పలు నగరాల్లో కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని ఆశగా ఈ బ్యూటీ ఎదురుచూస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment