Actress Nidhi Agarwal Says Luck Is Very Important In Film Industry, Deets Inside - Sakshi
Sakshi News home page

Nidhi Agarwal : దేనికైనా అదృష్టం ఉండాలి: నిధి అగర్వాల్‌

Published Thu, Dec 29 2022 9:33 AM | Last Updated on Thu, Dec 29 2022 11:56 AM

Luck Is Very Important In Film Industry, Nidhi Agarwal Says - Sakshi

సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమని అంటోంది నటి నిధి అగర్వాల్‌. ఆకర్షణీయమైన అందం ఈమె సొంతం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నా ఆ స్థాయిలో పెద్ద హిట్లు సాధించలేకపోతోంది. తమిళంలో జయం రవికి జంటగా భూమి, శింబు సరసన ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలగతలైవన్‌ చిత్రాలు చేసింది. వీటిల్లో ఏది ఈ అమ్మడి కెరీర్‌కు ప్లస్‌ కాలేదనే చెప్పాలి. ఇటీవల నిధి అగర్వాల్‌ ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను అదృష్టాన్ని నమ్ముతానని చెప్పింది.

అది లేకపోతే ఎవరికి ఏదీ కుదరదని పేర్కొంది. ముఖ్యంగా సినిమా రంగంలో అదృష్టం చాలా అవసరమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయని.. అయితే చివరికి చిత్రం వేరే విధంగా వస్తుందని పేర్కొంది. అదే విధంగా పేపర్‌పై సుమారుగా ఉన్న కథలు తెరపై చూస్తే బ్రహ్మాండంగా ఉండి ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది. అందుకు కారణం 90 శాతం అదృష్టమే అని తాను భావిస్తానంది.

ఇకపోతే కథలను ఆశతో ఎంపిక చేసుకునే స్థాయికి తాను చేరుకున్నానని భావించడం లేదని చెప్పింది. అయితే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా నాట్యానికి ప్రముఖ్యత ఉన్న కథా చిత్రంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్నా నటన పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని అయితే వ్యాపారపరంగా చాలా తేడా ఉంటుందని నటి నిధి అగర్వాల్‌ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement