
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.
దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)

మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.
ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment