సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కల నెరవేర్చుకుంటారు. మరికొంత మందికి నటించాలని ఉన్నా..అవకాశాలు రావు. ఒక్క చాన్స్ కోసం ఎన్నో రోజులు వేచి చూస్తారు. అవకాశం వచ్చినప్పుడే తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. ఆ తర్వాత దర్శకనిర్మాతలే వారి ఇళ్ల చుట్టు తిరుగుతారు. కానీ మొదట వచ్చే ఆ ఒక్క చాన్స్ కోసం కొంతమంది ఎన్నో కష్టాలు పడతారు. ఎన్నో అవమానాలను, మోసాలను భరించి.. తమ కలను నెరవేర్చుకుంటారు. అలా తాను కూడా తొలి సినిమా కోసం చాలా కష్టాలు పడ్డానని అంటోంది అందాల తార నిధి అగర్వాల్(Nidhi Agarwal). దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టు తిరిగితే కానీ తనకు అవకాశం రాలేదని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి తన సినిమా కష్టాల గురించి వివరించింది.
(చదవండి: అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్)
దీపికా పదుకొణెను చూసి సినిమాల్లోకి..
నేను సినిమాల్లోకి రావడానికి కారణం దీపికా పదుకొణె. ఆమెను ఇన్స్పిరేషన్‌గా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చా. తెరపై దీపికను చూసి..నేను కూడా హీరోయిన్ అవుతానని ఇంట్లో చెప్పాను. మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చెయ్.. ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు. కొన్నాళ్ల తర్వాత సినిమాలపై నాకున్న పిచ్చి చూసి..మా నాన్నగారే ప్రోత్సహించారు. హీరోయిన్‌గా ట్రై చెయ్ అని చెప్పారు. అలా ఇంట్లోవాళ్ల అనుమతితో ఇండస్ట్రీలోకి వచ్చాను.
రెండేళ్ల పాటు తిరిగా
సినిమా చాన్స్‌లు ఈజీగా వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఒక్క చాన్స్ రావడం అంత ఈజీ కాదు. నేను అయితే దాదాపు రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రెండు మూడు సార్లు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని..ఆ తర్వాత మీకు అవకాశం లేదని బయటకు పంపించేశారు. చివరిగా మైఖేల్ మున్నా సినిమా ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. దాదాపు 300 మందిని ఆడిషన్ చేయగా.. అదృష్టం కొద్ది నేను సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమా చూసి నాకు నాగ చైతన్య(Naga Chaitanya) ‘సవ్యసాచి’లో చాన్స్ వచ్చింది.
అందుకే గ్యాప్ వచ్చింది
ఈ మధ్యకాలంలో నేను సినిమాలు తగ్గించాను అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవమే. కానీ అవకాశాలు రాలేక కాదు.. ఓ ఒప్పందం కారణంగా సినిమాలు చేయట్లేదు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యేవరకు ఇతర చిత్రాల్లో నటించకూడదని నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. అదే సమయంలో నాకు ది రాజా సాబ్(The Raja Saab) మూవీలో అవకాశం వచ్చింది. దాంతో హరిహర వీరమల్లు మేకర్స్ ని ఆ సినిమాలో చేస్తాను అని అడగగా వాళ్ళు ఓకే చేశారు. ఈ రెండు చిత్రాలు నా కెరీర్‌కి చాలా స్పెషల్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment