అందుకే  స్టార్‌ హీరో సినిమాలో ఛాన్సులు వస్తు‍న్నాయి : నిధి అగర్వాల్‌ | Nidhi Agarwal Shocking Comments About Film Industry | Sakshi
Sakshi News home page

Nidhi Agarwal: నిధి అగర్వాల్‌ గ్లామరస్‌ ఫోటోలు ఎందుకు షేర్‌ చేస్తుందో తెలుసా?

Published Fri, Oct 21 2022 8:52 AM | Last Updated on Fri, Oct 21 2022 10:28 AM

Nidhi Agarwal Shocking Comments About Film Industry - Sakshi

తమిళసినిమా: గ్లామర్‌ను నమ్ముకున్న యువ కథానాయికల్లో నటి నిధి అగర్వాల్‌ ఒకరు. అయినా ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 2017లో మున్నా మైఖేల్‌ చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అక్కడ అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ 2018లో సవ్యసాచి అనే చిత్రంతో పరిచయం అయ్యింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అదే ఏడాది ఈశ్వరన్‌ చిత్రం ద్వారా కోలివుడ్‌కు వచ్చింది. శింబుకు జంటగా నటించిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్‌ కాకపోయినా నిధి అగర్వాల్‌ మాత్రం బాగానే వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం నటుడు శింబుతో ప్రేమాయణం అనే ప్రచారం వైరల్‌ కావడమే. అలాగే తమిళంలో జయం రవికి జంటగా భూమి అనే చిత్రంలో నటించింది.

ఆ చిత్రం మంచి ప్రశంసలు అందుకున్నా, ఓటీటీలో విడుదల కావడంతో ఈమెకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దీంతో ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. ప్రస్తుతం కళగ తలైవన్‌ అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇక తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో? ఆ చిత్ర దర్శక నిర్మాతలకే తెలియడం లేదు. దీంతో అవకాశాల వేటలో పడ్డ నిధి అగర్వాల్‌ గ్లామరస్‌ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. దీని గురించి ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఇక్కడ ప్రతిభకు విలువ లేదంది.

గ్లామర్‌కే ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా అందాలను ఆరబోసే వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారంది. అయితే 20 శాతం మంది మాత్రమే ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. మరో విషయం ఏంటంటే తనకు ఇక్కడ స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు రావడానికి కారణం పారితోషికమే అని చెప్పింది. ప్రముఖ హీరోయిన్లు డిమాండ్‌ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకే పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement