
ఏ రంగంలోనైనా సక్సెస్‌తోనే ఏదైనా ముడిపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా విజయం వరించకపోతే అవకాశాలు దరిచేరవు. ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలాంటిదే! చూడచక్కని అందం ఈ చిన్నదాని సొంతం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నిధి అగర్వాల్ నటించింది. వాటిలో తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టింది. తమిళంలో జయం రవి సరసన భూమి, శింబుతో ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవి నిధి అగర్వాల్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై స్పందించిన నిధి అగర్వాల్ ఒక భేటీలో మాట్లాడుతూ.. నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొంది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజమే, తాను ఇప్పటివరకు సినిమాల్లో అందంగా కనిపించాలన్న విషయంపైనే దృష్టి సారించానని, అలా గ్లామరస్ పాత్రలో నటించానని చెప్పింది.
అయితే ఇప్పుడు నటన గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను చూస్తూ తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నట్లు చెప్పింది. ఇకపై ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర పోషిస్తున్నానని, ఇది తన సినీ కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి
Comments
Please login to add a commentAdd a comment