Viral: RIP Joseph Vijay, Aids Patient Ajith Trending In Social Media - Sakshi
Sakshi News home page

Vijay-Ajith: ట్విటర్‌లో ఫ్యాన్స్‌ వార్‌, స్టార్‌ హీరో చనిపోయాడంటూ ట్రోలింగ్‌!

Mar 26 2022 5:25 PM | Updated on Mar 26 2022 6:13 PM

RIP Joseph Vijay, Aids Patient Ajith Trending In Social Media - Sakshi

అతడికి దండేసి ఉన్న ఫొటోను నెట్టింట షేర్‌ చేస్తూ #RIPJosephVijay అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. విజయ్‌ అర్ధాంతరంగా చనిపోయాడని, బీస్ట్‌ అతడి చివరి సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ కొత్తేమీ కాదు. కానీ కొన్నిసార్లు శృతి మించి ప్రవర్తిస్తున్నారు అభిమానులు. తాజాగా సోషల్‌ మీడియాలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ చనిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. అతడికి దండేసి ఉన్న ఫొటోను నెట్టింట షేర్‌ చేస్తూ #RIPJosephVijay అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. విజయ్‌ అర్ధాంతరంగా చనిపోయాడని, బీస్ట్‌ అతడి చివరి సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

అయితే ఇది అజిత్‌ ఫ్యాన్స్‌ పనే అయ్యుంటుందని ఆగ్రహించిన విజయ్‌ ఫ్యాన్స్‌ సదరు హీరోను ట్రోల్‌ చేస్తున్నారు. అజిత్‌కు ఎయిడ్స్‌ అంటూ #Aids_Patient_Ajith అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరు ఫ్యాన్స్‌ గొడవపడి మధ్యలో హీరోలను ఎందుకు బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు చనిపోయారని, మరొకరికేమో లేనిపోని రోగాన్ని అంటగట్టి బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: కంగనాకు కోర్టులో చుక్కెదురు.. సెలబ్రిటీ అయినా పాటించాలి

మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే మేం తలెత్తాలి: సుకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement