ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రేమలో విఫలమైన శింబుతో ఆమె లవ్‌లో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ సినీప్రియులను ఆకర్షిస్తోంది. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఇది గతేడాది జనవరిలో రిలీజైంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట! కరోనా టైంలో లవ్‌లో పడ్డ నిధి కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే!
కాగా 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గతేడాది 'ఈశ్వరన్'తో కోలీవుడ్‌లో లక్ పరీక్షించుకున్న ఆమె ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. శింబు విషయానికి వస్తే 'మానాడు' సినిమాతో ఈ మధ్యే మంచి సక్సెస్ అందుకున్నాడీ హీరో. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి.
అప్సరసలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటోలు చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment