If I Was Not A Heroine, I would Have Started A Fashion Brand, Says Nidhhi Agerwal - Sakshi
Sakshi News home page

Nidhhi Agerwal : హీరోయిన్‌ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్‌

Published Sun, Sep 25 2022 9:02 AM | Last Updated on Sun, Sep 25 2022 11:03 AM

If I Was Not A Heroine, I would Have Started A Fashion Brand Nidhhi Agerwal Says - Sakshi

కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్‌ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్‌ చేసిన ఈశ్వరన్‌ ఆమెను నిరాశ పరిచింది.

అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్‌ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్‌ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్‌లో నటి నిధి అగర్వాల్‌కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది.

ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా నిధి అగర్వాల్‌ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్‌ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్‌ స్టేట్‌ ఛాంపియన్‌ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్‌ బదులిస్తూ నటిగా సక్సెస్‌ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement