సినిమా రంగుల ప్రపంచం. ఇందులో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఉంటుంది. బోల్డ్‌గా నటించే వారికి బోలెడు అవకాశాలు అందుతాయి. అందుకే తారలు ఫొటో సెషన్లు నిర్వహించి దర్శక, నిర్మాతలతో పాటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం ఫొటో సెషన్స్ నిర్వహించి గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవికాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తరువాత టాలీవుడ్‌లో సవ్యసాచి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మరింత వెలుగులోకి వచ్చింది.
ఆ చిత్రం బంపర్ హిట్ అయిన ఈమెకు అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే. ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. శింబు ఈ చిత్ర హీరో. ఇంకేముంది నిధి అగర్వాల్‌కు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా అందులోని పాటలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ముఖ్యంగా శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని వీరి పెళ్లికి పెద్దలు కూడా సమర్థించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేసింది.
వీరు సహజీవనం చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై శింబు, నిధి అగర్వాల్ స్పందించకపోవడం విశేషం. ఈ అమ్మడు నటించే చిత్రాల విషయానికి వస్తే మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.
చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్
ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ
Comments
Please login to add a commentAdd a comment