ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది.
దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్.
మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment