సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన నిధి ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది . గ్లామర్ డోస్‌కు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గని నిధి యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. వర్షం పాటల్లో నటించడం అంత సులువు కాదని, షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది.
పైనుంచి వర్షం పడుతున్నా, కళ్లు తెరిచి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం తన వల్ల కాదని, అలాంటి పాటలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పట్లో రెయిన్ సాంగ్స్ చేయడం గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment