అలాంటి చీప్‌ పనులు చేయకండి .. నెటిజన్లపై నిధి అగర్వాల్‌ ఫైర్‌ | Nidhi Agarwal Fires On Netizens For Sharing Her Photos | Sakshi
Sakshi News home page

అలాంటి ఫోటోలు వస్తే షేర్‌ చేయకండి: నిధి అగర్వాల్‌

Published Fri, Jul 16 2021 2:18 PM | Last Updated on Fri, Jul 16 2021 7:22 PM

Nidhi Agarwal Fires On Netizens For Sharing Her Photos - Sakshi

ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌.. సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆమె షేర్‌ చేసే ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతుంటాయి. ఆమె అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఎప్పుడూ ఫోటో షూట్స్‌తో రచ్చ చేసే.. నిధి తాజాగా ఓ విషయం మీద బాగా సీరియస్‌ అయింది. అలాంటి ఫోటోలు షేర్‌ చేయకండి అంటూ నెటిజన్లకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 

‘నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వవల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం. అవి చీప్ పనులే అవుతాయి. దిగజారకండి’అంటూ నిధి ఫైర్‌ అయింది. ఆమె అంతలా ఫైర్‌ కావడానికి కారణమైన ఫోటో ఏదో మాత్రం చెప్పలేదు. ఇక నిధి సినిమాల విషయానివస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అలాగే అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement