'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్‌లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.
(ఇదీ చదవండి: హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)
యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)
Comments
Please login to add a commentAdd a comment