'జాతిరత్నాలు' ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..? | Faria Abdullah Will Be Soon Get Married? | Sakshi
Sakshi News home page

'జాతిరత్నాలు' ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..?

Mar 15 2024 1:07 PM | Updated on Mar 15 2024 1:16 PM

Faria Abdullah Will Be Soon Get Marriage - Sakshi

తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్‌ గుండెల్ని తాకింది ఫరియా అబ్దుల్లా. మొదట్లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. జాతిరత్నాలు తర్వాత పలు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

తన చిన్ననాటి స్నేహితుడితో ఫిరియా పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితో ఆమె వివాహం జరగనుందట. ఇప్పటికే ఆయన పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లలో నటించాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. నిజం ఎంటో తెలియాలంటే మన చిట్టి చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. 

ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన ఫరియా.. తనకు కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారని కూడా తెలిపింది. కానీ వాళ్లు కేవలం బాయ్‌ఫ్రెండ్స్‌ మాత్రమేనని. రిలేషన్‌, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని ఆ సమయంలో చెప్పింది. తాజాగా ఆమె పెళ్లి వార్తలు బయటకు రావడంతో తను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినట్లు చెబుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్‌తో అల్లరి నరేశ్‌తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంలో నటించింది ఫరియా అబ్దుల్లా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement