
సూపర్ హిట్ కంటెంట్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ఆహ.. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్‌జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరీస్‌కి విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
‘ఈ ఉడతని ఎలా పట్టుకుంటారో తెలుసా?ఒక చెట్టుకి చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేస్తారు. ఉడత అందులో తల దూరుస్తుంది. తిరిగి బయటకు రాలేదు. అప్పుడు దాన్ని ఈజీగా బయటకు తీస్తారు’ అంటూ జగపతి బాబు చెప్పిన వాయిస్ ఓవర్‌తో ప్రారంభయ్యే ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ప్రియదర్శి ఇప్పటి వరకు కనిపించని పాత్రలో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోన్న ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి:
‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే
‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫర్... ఓటీటీలో విడుదలకు సిద్దం!