సాక్షి, హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా రూపొందుతున్న మల్లేశం సినిమా ట్రైలర్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాను మల్లేశం ట్రైలర్ చూశానని తెలిపారు. ‘ఆసుయంత్రాన్ని ఆవిష్కరించిన గ్రామీణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం స్ఫూర్తిదాయకం. అద్భుత ఆవిష్కరణతో చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లేశం సినిమా బృందానికి శుభాకాంక్షలు’అని కేటీఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment