
సాక్షి, హైదరాబాద్: ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ నటి సమంత అక్కినేని చూశారు. వాస్తవికతతో హృదయాన్ని హత్తుకునే కథతో మల్లేశం సినిమా తనకు ఎంతగానో నచ్చినట్టు ట్విటర్‌లో ఆమె తెలిపారు. ‘మల్లేశం సినిమాను చూశాను. అత్యంత వాస్తవికతతో, హృదయాన్ని హత్తుకునే కథతో తెరకెక్కిన సినిమాల్లో మల్లేశం ఒకటి. తెలంగాణ సంస్కృతిని, తల్లి కోసం ఓ కొడుకు పడే తపనను, ప్రేమను ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి, ఝాన్సీల అభినయం అద్భుతంగా ఉంది’ అంటూ సమంత ట్వీట్ చేశారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె చేనేతగా మద్దతుగా ‘హ్యాండ్లూమ్’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. చేనేత రంగంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి.. ఆమె కష్టాన్ని తొలగించేందుకు ఆసుయంత్రాన్ని రూపొందించిన తెలంగాణ చేనేత వృత్తిదారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment