ప్రియదర్శి, నందిని రాయ్ పోసాని కృష్ణుమరళి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్’(ఐఎన్‌జీ). విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కు రంగా యాలి షో రన్నర్‌గా వ్యవహిరిస్తున్నాడు. బాషా, ప్రేమ, మాస్టర్, డాడీ చిత్రాల దర్శకుడు సురేశ్ కృష్ణ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సురేశ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ తననే నిర్మించమని ఆహా అధినేత అల్లు అరవింద్ చెప్పారన్నాడు. క్రైం థ్రీల్లర్ బ్యాక్ డ్రాప్‌తో విద్యాసాగర్ చెప్పిన ఈ కథ నచ్చడంతో సిరీస్‌ను నిర్మించానని, దర్శకుడిగా చేసిన తనకు నిర్మాతగా ఈ ప్రయాణం కొత్తగా ఉందని పేర్కొన్నాడు.
ఇక నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాషా మూవీ చూశాక సురేశ్ కృష్ణతో పనిచేయాలనుకున్నాను, అందుకే ఆయనతో కలిసి మా బ్యానర్‌లో(గీతా ఆర్ట్స్) మాస్టర్, డాడీ చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు ఆహా కోసం సురేశ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్‌ను నిర్మించాడు’ అని ఆయన చమత్కరించాడు. చివరగా ప్రియదర్శి మాట్లాడుతూ.. తను నటించిన ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక అల్లు అరవింద్, సురేశ్ కృష్ణ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడంతో తన కల నిజమైందంటూ చెప్పుకొచ్చాడు.
How far will you go #InTheNameofGod?
— ahavideoIN (@ahavideoIN) May 18, 2021
This original crime thriller is comING soon to shock you, only on #ahavideoIN. 🔥@priyadarshi_i @ImNandiniRai @Suresh_Krissna #VidyasaagarMuthukumar @RangaYali pic.twitter.com/N8KGBLj3A6
Comments
Please login to add a commentAdd a comment