
అర్జున్ మహి
‘‘లిప్‌లాక్‌లు ఉండటం వల్ల ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100’ సినిమాలు విజయం సాధించలేదు. అలాంటి ట్రిక్స్‌కు ఆడియన్స్ పడరు. కంటెంట్, కథ బలంగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఆ సినిమాలను హిట్ చేశారు. కొందరు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో మా చిత్రాన్ని పోలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని అర్జున్ మహి అన్నారు. వి. రుద్ర దర్శకత్వంలో అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఇష్టంగా’. ప్రియదర్శి ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్ మహి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడే హీరో కావాలని ఫిక్స్ అయ్యాను.
ఇంజినీరింగ్ పూర్తి చేశాక సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా విడుదలకు రెడీ అవ్వడం హ్యాపీగా ఉంది. యాక్టింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోలేదు. వందల సినిమాలు చూశాను. టాలీవుడ్‌లో చాలా మంచి హీరోలు ఉన్నారు. చిరంజీవిగారు నాకు స్ఫూర్తి. ఈ సినిమాలో బాధ్యత లేని, ఆల్రెడీ బ్రేకప్ అయిన కృష్ణ అనే కొరియోగ్రాఫర్ పాత్ర చేశాను. లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ , లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనే కాన్సెప్ట్‌లను ఈ సినిమాలో చర్చించాం. మహావీర్ మంచి సంగీతం అందించారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా చిత్రం హ్యాపీగా చూడొచ్చు. సినిమాలో చివరి 25 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment