In The Name Of God Trailer Out Now: Crime Thriller Web Series, Priyadarshi, Nandini Rai - Sakshi
Sakshi News home page

In The Name Of God: సైతాన్‌కి, దేవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా!

Published Sat, Jun 12 2021 5:20 PM | Last Updated on Sat, Jun 12 2021 5:29 PM

In The Name Of God Trailer Out Now - Sakshi

ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 న ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 

అరేయ్‌..నీకు సైతాన్‌కి, దేవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా! సైతాన్‌ నీలో ఉన్న కోరికను రెచ్చగొట్టి.. నువ్వు తప్పు చేసేలా చేసి.. నువ్వు కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడురా. కానీ దేవుడు అలా కాదు.. చాలా సింపుల్‌. నువ్వు తప్పు చేసినప్పుడే చంపేస్తాడు’ అంటూ ప్రియదర్శి చెప్పే భారీ డైలాగ్‌తో  ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా సాగింది.  ప్రియదర్శి ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి.  లిప్‌లాక్‌, ఫైట్స్‌ సీన్స్‌తో హాట్‌ హాట్‌గా  ఉన్న ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement