
బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో చేనేత కార్మికుడిగా ప్రఖ్యాతి గాంచిన మల్లేశం జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ అవార్డు అందుకున్న మల్లేశం పాత్రలో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ రేపు (ఫిబ్రవరి 3న) సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.