Balagam Movie Actress Saudamini Shares Her First Movie Experience, Deets Inside - Sakshi
Sakshi News home page

Balagam Movie Soudamini: 'ఒక్క డైలాగ్‌ లేదు.. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు'

Apr 24 2023 6:54 PM | Updated on Apr 25 2023 8:45 PM

Balagam Movie Actress Soudamini Shares First Movie Experience - Sakshi

బలగం సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పల్లె సెంటిమెంట్‌ను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు వేణు యెల్దండిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటీనటులకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేని పాత్ర ఒకటుంది. ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 

బలగం సినిమాలో ఆ సీన్ మీకు గుర్తుందా? 'అదేనండి ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి థమ్స్‌ అప్‌ బాటిల్‌ తెచ్చి ఇవ్వడం.. ఆ తర్వాత ప్రియదర్శి సిగ్గుపడడం.. అది చూసి ముసలావిడ ముఖం తిప్పుకోవడం' ఆ సీన్‌లో బొద్దుగా కనిపించిన అమ్మాయి గురించి మీకు తెలుసా? ఇంతవరకు ఒక్క సినిమా చేయకుండానే అద్భుతంగా నటించింది. ఒక్క డైలాగ్‌ లేకపోయినా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. ఆ అమ్మాయి పేరే సౌదామిని. ఆర్టిస్ట్‌ కావాలన్న కోరికతో టాలీవుడ్‌లో తొలి అవకాశం అందుకున్న సౌదామిని తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 
(చదవండి: Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!)

సౌదామిని మాట్లాడుతూ.. ' వేణు సర్ ఆఫీసుకు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు. వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్‌గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగా. కేకులు తినేసి బరువు పెరిగాను. నాకు ఫన్ జోనర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్‌ ఇయర్‌లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు భయం. అన్నయ్యను తీసుకెళ్లేవాణ్ని. కొందరు నన్ను చూసి నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాళ్లు. నేను ఈ స్థాయికి రావడానికి వేణు సర్ కారణం. వేణు సర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. బలగం సినిమా తర్వాత జాతిరత్నాలు డైరెక్టర్‌ అనుదీప్ కాల్ చేశారు. మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్‌ ఇస్తామని చెప్పారు.  వేణు సర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. తెలుగులో అల్లు అర్జున్, చిరంజీవి నా ఫేవరేట్.' అని చెప్పారు. 
(చదవండి: Pooja Hegde: బుట్టబొమ్మను వదలని ఫ్లాపులు.. ఆ సినిమాతోనైనా మారేనా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement